దూకుడుగా ఆడుతున్న టీమిండియా

దూకుడుగా ఆడుతున్న టీమిండియా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. 8 బంతుల్లో  50 పరుగులు పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న ధావన్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన కెరీర్‌లో 20వ అర్ధ శతకం నమోదు చేశాడు. 2 అయితే 9.2 ఓవర్లో ఇష్ సోధీ వేసిన బంతిని ఆడిన రోహిత్‌.. సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 30 పరుగులు చేసిన శిఖర్ ధవన్ కివీస్ బౌలర్ ఫెర్గూసన్ బౌలింగ్ లో గ్రాండ్ హోమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు పూర్తి చేసుకున్న టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కోల్పోయి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌ పంత్‌(12), విజయ్ శంకర్(1) ఉన్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కృనాల్‌ పాండ్య మూడు వికెట్లు తీసి కివీస్‌ టాప్‌ ఆర్డర్‌ను కుదేలు చేశడు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకుని రాణించినా భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. గ్రాండ్‌హోమ్‌(50), రాస్‌ టేలర్‌(42) బౌండరీల మోత మోగించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 77పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కృనాల్‌ పాండ్య మూడు వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ రెండు, భువి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ తీయడంతో కివీస్‌ నిర్ణీత 20ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేయగలిగింది.