భారత్‌ లక్ష్యం 162

భారత్‌ లక్ష్యం 162

హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు భారత మహిళల ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి.. భారత్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్‌ సోఫి డెవిన్‌ శుభారంభం ఇచ్చింది. హాఫ్‌ సెంచరీ (72: 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి కివీస్ జట్టుకు భారీ స్కోర్ అందించింది. కెప్టెన్‌ అమీ సట్టెర్‌వైట్‌ (31), సుజీ బెట్స్‌(23)లు రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మకు రెండు వికెట్లు తీయగా.. మాన్సీ జోషి, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి, పూనమ్‌ యాదవ్‌లకు తలో వికెట్‌ తీశారు.