చివరి టీ20 అయినా...

చివరి టీ20 అయినా...

న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్‌లో పరాభవం ఎదురైంది. మూడు టీ20 సిరీస్‌లో మొదటి, రెండవ మ్యాచ్‌లలో ఓడి.. మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించింది హర్మన్‌ప్రీత్‌కౌర్ సేన. ఇక ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి.. న్యూజిలాండ్‌ చేతిలో వైట్‌వాష్‌ను తప్పించుకొని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

బ్యాటింగ్‌ వైఫల్య కారణంగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత మహిళలు ఈసారైనా చెలరేగాల్సిన అవసరం ఉంది. టాపార్డర్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లు మరోసారి చెలరేగాలని జట్టు భావిస్తోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఓపెనర్ ప్రియా పూనియా, హేమలత మాత్రం స్కోర్ చేయడంలో విఫలమవుతున్నారు. వెటరన్‌ మిథాలీరాజ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ మెరుగైన స్కోరు చేస్తేనే జట్టు విజయం సాధించే అవకాశం ఉంది. టీ20లో భారత స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌వుమెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. వెటరన్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ రెండు మ్యాచ్‌ల్లో విఫలమయింది. ఈ టీ20లోనైనా బౌలర్ల ప్రదర్శన మెరుగవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్‌ సమష్టిగా రాణిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయాలని కివీస్‌ బరిలోకి దిగుతోంది.