ఎన్ఐఏ కస్టడీకి కోడికత్తి నిందితుడు

ఎన్ఐఏ కస్టడీకి కోడికత్తి నిందితుడు

ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును ఏడు రోజుల ఎన్ఐఏ కస్డడికి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అధికారులు అతడిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని, విచారణలో భాగంగా నిందితుడిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించరాదని స్పష్టం చేసింది. విశాఖ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసును ఇటీవల కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు  సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే.