భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా కూడా ప్రతికూల అంశాలు ఎదురు కావడంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న భారీగా నష్టపోయిన యూరో మార్కెట్లలో ఇవాళ కూడా అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఉదయం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో దాదాపు 40 పాయింట్లు నష్టపోయిన నిఫ్టి  మిడ్‌సెషన్‌ వరకు పడుతూనే ఉంది. మిడ్‌ సెషన్‌లో 10955 వద్ద నిఫ్టికి మద్దతు అందింది. అక్కడి నుంచి ఓపెనింగ్‌ స్థాయి అంటే 11023కి చేరిన నిఫ్టి.. .చివరి అరగంటలో భారీ నష్టాలకు లోనైంది. అక్కడి నుంచి నిఫ్టి నేరుగా 10925కి క్షీణించింది. తరవాత స్వల్పంగా కోలుకుని 10941 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 125 పాయింట్లు, సెన్సెక్స్‌ 424 పాయింట్లు క్షీణించింది.

ఇవాళ అనేక షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా టాటా మోటార్స్‌ ఓపెనింగ్‌లో రూ. 128కి పడినా తరవాత కోలుకుని రూ. 150 వద్ద  స్థిరంగా రోజంతా ట్రేడైంది. ఈకౌంటర్లో ఏకంగా 10 కోట్లకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. నిఫ్టి లూజర్స్‌లో ఈ స్ర్కిప్‌దే ప్రథమ స్థానం. తరవాతి స్థానాల్లో  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, వేదాంత, ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిం  షేర్లు ఉన్నాయి. ఇక లాభలార్జించిన నిఫ్టి షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌ 6.7 శాతం లాభంతో క్లోజైంది. తరవాతి స్థానాల్లో ఉన్న కొటక్‌ బ్యాంక్‌, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్ల లాభాలు ఒక శాతం కంటే చాలా తక్కువ. కుట్ర పూరితంగా తాకట్టు పెట్టిన తమ షేర్లను పలు ఎన్‌బీఎఫ్‌సీలు అమ్మేశాయని అనిల్‌ అంబానీ విమర్శించారు. ఇవాళ ఆయన గ్రూప్‌నకు చెందిన పలు షేర్లు లాభాలతో ముగిశాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ 11శాతం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 7 శాతం, ఆర్‌ పవర్‌ పది శాతం, ఆర్‌ కామ్‌ 5 శాతం వరకు లాభాలు పొందాయి.