లాభాల్లో ముగిసిన నిఫ్టి

లాభాల్లో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమై... ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. రూపాయి కాస్త బలపడటం, ముడి చమురు ధరల్లో పతనం కొనసాగుతుండటంతో నిఫ్టి 92 పాయింట్ల లాభంతో 10,693 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 361 పాయింట్లు పెరిగింది.  నిఫ్టి ప్రధాన షేర్లలో కొటక్‌ బ్యాంక్‌ ఏకంగా 9 శాతం పెరిగింది. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ , అదానీ పోర్ట్స్‌ మూడు శాతం, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు రెండు శాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 5 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. గెయిల్‌ నాలుగు శాతం క్షీణించగా, సన్‌ ఫార్మా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా రెండు శాతంపైగా నష్టపోయాయి.