భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో పాటు దేశీయంగా ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరింగా ఉండటంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 145 పాయింట్ల లాభంతో 11515 వద్ద క్లోజ్ కాగా, బీఎస్ఈ సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగి 38090 వద్ద ముగిసింది. వినియోగదారుల ద్రవ్యోల్బణ రేటు పది నెలల కనిష్ఠ స్థాయి 3.69 శాతానికి క్షీణించింది.  ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో రూపాయి విలువ స్థిరంగా ఉంది. దాదాపు అన్నిరంగాల సూచీలు గ్రీన్ లో ముగిశాయి. అత్యధికంగా రియాల్టి సూచీ మూడున్నర శాతం పెరిగింది. మెటల్, ఫార్మా, పీఎస్ యూ బ్యాంక్ సూచీలు కూడా రెండు శాతం పైగా పెరిగాయి. నిఫ్టి షేర్లలో ఇండియా హౌసింగ్ ఫైనాన్స్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్  షేర్లు ఆరు శాతంపైగా పెరిగాయి.  హెచ్ పీసీఎల్, వేదాంత షేర్లు కూడా 5 శాతంపైగా పెరగడం విశేషం. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో హెచ్ సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, గెయిల్ షేర్లు ఉన్నాయి. నిఫ్టిలో కేవలం నాలుగు ఫేర్లు నష్టపోగా ఒక షేర్ ధరలో మార్పులేదు. ఇతర షేర్లలో బలరామ్ పూర్ చినీ రికార్డుస్థాయిలో 14 శాతం పెరిగింది.