రూపాయి అండతో లాభాల్లో నిఫ్టి

రూపాయి అండతో లాభాల్లో నిఫ్టి

ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో రూపాయి అనూహ్యంగా కోలుకోవడం షేర్ మార్కెట్‌ తేరుకుంది.  క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో 11,369 వద్ద ముగిసింది.  ఇవాళ రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి చేరి 73కి చేరువైంది. ఈలోగా ఆర్బీఐ నుంచి అందిన మద్దతుతో రూపాయి 80 పైసల వరకు కోలుకుంది. దీంతో షేర్ మార్కెట్ తేరుకుంది. ఎఫ్ఎంసీజీ సూచీ రెండున్నర శాతం లాభపడింది. రియాల్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో పవర్ గ్రిడ్, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఐటీసీ, హిందాల్కో లాభాల్లో ముగిశాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్ పీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ తో పాటు ఐఓసీ ఉన్నాయి. యూనిటెక్ 6 శాతంపైగా నష్టపోయింది.