స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

దిగువస్థాయిలో మద్దతు అందడంతో నిఫ్టి స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా... ఫార్మా రంగ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా మిడ్‌ సెషన్‌ వరకు నిఫ్టి నష్టాల్లో ఉంది. మిడ్‌ సెషన్‌ తరవాత దిగువస్థాయిలో మద్దతు అందడంతో నిఫ్టి కోలుకుని క్రితం స్థాయికి చేరింది. సెన్సెక్స్‌ 113 పాయింట్లతో నిఫ్టి 18 పాయింట్ల లాభంతో ముగిశాయి. అత్యధికంగా ఫార్మా, రియల్ ఎస్టేట్‌, మీడియా రంగ సూచీలు ఒకశాతంపైగా క్షీణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇవాళ 44 పైసలు క్షీణించింది. నిఫ్టి ప్రధాన షేర్లలో టైటాన్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ షేర్లు మూడు శాతంపైగా పెరిగాయి. ఐషర్‌ మోటార్స్‌ 2.5 శాతం, బజాజ్‌ ఆటో 1.7 శాతం లాభంతో క్లోజయ్యాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ నాలుగు శాతం నష్టంతో టాప్‌లో ఉంది. హిందాల్కో, ఎస్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు మూడు శాతంపైగా నష్టంతో ముగిశాయి. చురుగ్గా ట్రేడైన ఇతర షేర్లలో ఆర్‌ కామ్‌, ఆర్‌ పవర్‌ 35 శాతం నష్టంతో ముగిశాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ 20 శాతం క్షీణించింది.