న‌ష్టాల్లో నిఫ్టి

న‌ష్టాల్లో నిఫ్టి

స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నాయి. నిన్నటి నుంచి అంత‌ర్జాతీయ మార్కెట్లలో అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. యూరో, అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో క్లోజ్ కాగా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో కూడా ఇదే ధోర‌ణి వ్య‌క్త‌మౌతోంది. డాల‌ర్‌లో పెద్ద మార్పు లేదు. ఆయిల్ మార్కెట్ల‌లో డౌన్ ట్రెండ్ కొన‌సాగుతోంది. డాల‌ర్‌తో రూపాయి విలువ‌లో కూడా పెద్ద మార్పు లేదు. ఆర్బీఐ ప్ర‌క‌టించిన ప‌ర‌ప‌తి విధానం... ఆర్థిక వృద్ధి రేటు మంద‌గించింద‌ని చెప్ప‌క‌నే చెప్ప‌డంతో... కీల‌క రంగ‌ల్లో అమ్మ‌కాలు సాగుతున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ అమ్మ‌కాలు నిఫ్టిని దెబ్బ‌తీశాయి. టాటా మోటార్స్ ఒక ద‌శ‌లో 30 శాతం దాకా క్షీణించి ఇపుడు 20 శాతంపైగా న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. దీంతో నిఫ్టి పై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. ఒక‌ద‌శ‌లో 50 పాయింట్లు న‌ష్ట‌పోయిన నిఫ్టి ఇపుడు 35 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, బీపీసీఎల్‌, టైటాన్‌, హెచ్‌పీసీఎల్ లాభాల్లో ముందుండ‌గా న‌ష్టాల్లో టాటా మోటార్స్ ముందుంది. ఈ షేర్ ఇపుడు 15 శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. త‌రువాతి స్థానంలో జీ ఎంట‌ర్‌టైన్ మెంట్ ఉంది. స‌న్ పార్మా, గ్రాసిం, వేదాంత షేర్లు త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.  ఇటీవ‌ల బాగా క్షీణించిన రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, ఆర్ ప‌వ‌ర్ షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి.