భారీ లాభాల్లో నిఫ్టి

భారీ లాభాల్లో నిఫ్టి

మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌స్తుతం 72 పాయింట్ల లాభంతో 10922 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు లాభాల‌తో క్లోజ్ కాగా, ఉద‌యంనుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్ మార్కెట్లు ఒక‌టిన్న‌ర శాతం లాభంతో ట్రేడ‌వుతున్నాయి. డాల‌ర్‌లో పెద్ద మార్పులు లేదు. అలాగే రాత్రి అమెరికా మార్కెట్ క్రూడ్ ధ‌ర‌ల్లో మార్పు లేదు. కానీ.. ఉద‌యం నుంచి  క్రూడ్ ఒక‌టిన్న‌ర శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. వెనిజులాపై ఆంక్ష‌లు విధిస్తామ‌ని అమెరికా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డ‌మే దీనికి కార‌ణం. దీంతో ఇపుడు కాస్త బ‌లంగా ఉన్న రూపాయి మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతుందా అన్న‌ది చూడాలి. మ‌న మార్కెట్‌లో దాదాపు అన్ని రంగాల షేర్ల  సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఎస్ బ్యాంక్ నిన్న 15 శాతం పెర‌గ్గా, ఇవాళ మ‌రో ప‌ది శాతం పెరిగింది. బ్యాంక్‌కు కొత్త అధిప‌తి రానుండ‌ట‌మే దీనికి కార‌ణం. ఇక నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో లాభాల్లో ముందున్న షేర్లు... ఎస్ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, యాక్సిస్ బ్యాంక్‌. ఇక న‌ష్టాల్లో ముందున్న నిఫ్టి షేర్లు....  జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, హీరో మోటో కార్ప్‌, గెయిల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌.