నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైంది. ప్రస్తుతం 50 పాయింట్ల న‌ష్టంతో 10,893 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్ టాటా స్టీల్‌ గెయిన‌ర్‌గా నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సిప్లా, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్ర, జీ గ్రూప్‌ నిలిచాయి. నష్ట పోయిన షేర్లలో ఇండియా బుల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ ఉన్నాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. డాక్టర్‌ రెడ్డీస్‌  షేర్లు  దాదాపు మూడు శాతం విలువ కోల్పోయాయి. రూపాయి డాలర్‌తో పోలిస్తే కొంత బలపడింది. నేడు రూ.71.28 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.