న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

వృద్ధి రేటు త‌గ్గుతుంద‌న్న ఐఎంఎఫ్ అంచ‌నాల‌కు తోడు చైనా వృద్ధి రేటు 28 ఏళ్ళ క‌నిష్ఠ స్థాయికి చేర‌డంతో ప్రపంచ మార్కెట్ల‌లో టెన్ష‌న్ క‌న్పిస్తోంది. అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా... ఆసియా మార్కెట్ల‌లో ఆందోళ‌న క‌న్పిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా లాభ‌ప‌డ్డాయి. డాల‌ర్ ఇండెక్స్ కూడా స్థిరంగా ఉంది. క్రూడ్ ధ‌ర‌ల్లో కూడా పెద్ద మార్పు లేదు. ఈ నేప‌థ్యంలో డాల‌ర్‌తో రూపాయి  మార‌కం రేటు స్థిరంగా ఉంది. నిఫ్టి ప్ర‌స్తుతం 45 పాయింట్ల న‌ష్టంతో 10900పైనే ట్రేడ‌వుతోంది. అయితే నిఫ్టి షేర్ల‌లో మెజారిటీ షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ఫార్మా,రియాల్టి మిన‌హా మిగిలిన షేర్ల సూచీలు రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో స‌న్ ఫార్మా, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, విప్రో షేర్లు ఉన్నాయి. ఇక న‌ష్టా్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో టాటా స్టీల్‌, వేదాంత‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, మ‌హీంద్ర అండ్ మ‌హీంద్రా ఉన్నాయి.