స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

అంత‌ర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నా మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. కార్పొరేట్ ఫ‌లితాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. నిఫ్టి ప్రస్తుతం 5 పాయింట్ల నష్టంతో 10825 పాయింట్ల‌ వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా  మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. డాల‌ర్‌, ముడి చ‌మురు ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. క్రూడ్ ధ‌ర‌లు రాత్రి బాగా క్షీణించాయి. దీంతో ఇవాళ రూపాయి స్థిరంగా ఉంది. ఐటీసీ ఫ‌లితాలు నిరుత్సాహ‌క‌క‌రంగా ఉండ‌టంతో నిన్న ఈ షేర్‌లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌చ్చింది. ఇవాళ దిగువ స్థాయిలో కాస్త మ‌ద్ద‌తు అందుతోంది. ఇవాళ లాభాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఐటీసీ, ప‌వ‌ర్ గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌టెక్ లాభాల్లో ముందున్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.