స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా...మ‌న మార్కెట్లు మాత్రం నిస్తేజంగా ట్రేడ‌వుతున్నాయి. ఉద‌యం స్థిరంగా ప్రారంభ‌మైనా.. ప్ర‌స్తుత స్థాయిల వ‌ద్ద మ‌ద్ద‌తు అంద‌డం లేదు. నిఫ్టి ప్ర‌స్తుతం10895 వ‌ద్ద స్వ‌ల్ప న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ ఒక శాతంపైగా పెరిగింది... అయినా మ‌న ఐటీ షేర్ల‌లో పెద్ద ఆస‌క్తి వెల్ల‌డి కాలేదు. 1అలాగే ఉద‌యం నుంచి దాదాపు  ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, చైనా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా... జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు స్థిరంగా క్రితం ముగింపు వ‌ద్దే ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి షేర్ల‌లో 29 షేర్లు లాభాల్లో ఉన్నా... లాభ‌న‌ష్టాలు ప‌రిమితంగానే ఉండ‌టంతో సూచీలో పెద్ద మార్పు లేదు. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో డాక్ట‌ర్‌రెడ్డీస్ ల్యాబ్ టాప్‌గెయిన‌ర్‌గా నిలిచింది. హీరో మోటోకార్ప్‌, యూపీఎల్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, బ‌జాజ్ ఆటో షేర్లు త‌రువాతి స్థానాల్లో లాభ‌ల్లోట్రేడ‌వుతున్నాయి.  రేటింగ్ ఏజెన్సీల దెబ్బ‌తో భార‌తీ ఎయిర్‌టెల్ ఏకంగా నాలుగు శాతం దాకా న‌ష్ట‌పోయింది. నిఫ్టి షేర్ల‌లో భారీ న‌ష్టాల్లో త‌రువాతి స్థానాల్లో ఉన్న షేర్లు... ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, టెక్ మ‌హీంద్రా, వేదాంత‌. ఆర్‌కామ్ ఇవాళ కూడా మ‌రో అయిదు శాతం క్షీణించింది.