స్థిరంగా స్టాక్ మార్కెట్‌

స్థిరంగా స్టాక్ మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా పెద్ద‌గా లాభ‌న‌ష్టాలు లేకుండా ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. అమెరికా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు మూత‌ప‌డ‌కుండా... ఓ త‌త్కాలిక ప్ర‌ణాళిక సిద్ధ‌మౌతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అమెరికా ఫ్యూచ‌ర్స్ లాభాల్లో ఉండ‌టానికి ఇదే కార‌ణం. యూరో మార్కెట్లు ఓపెన్ అయ్యే స‌మ‌యానికి దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.ఈ నేప‌థ్యంలో నిఫ్టి నిల‌క‌డ‌గా ట్రేడ‌వుతోంది. ప్ర‌స్తుతం 10910-10870 మ‌ధ్య క‌ద‌లాడుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ప‌వ‌ర్ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఇండియా బుల్స్ హౌసింగ్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ ముందున్నాయి.  ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, హీరో మోటార్స్‌, హెచ్‌సీఎల్ టెక్‌, టీసీఎస్ ఉన్నాయి. నిన్న భారీగా న‌ష్ట‌పోయిన అపోలో హాస్పిట‌ల్స్ ఇవాళ నాలుగు శాతం రిక‌వ‌రైంది.