స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

ప్ర‌పంచ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్నా...మ‌న మార్కెట్లు స్థిరంగా క్రితం ముగింపు వ‌ద్దే ట్రేడ‌వుతున్నాయి. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా పెరిగాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి.  ముడి చ‌మురు ధ‌ర‌లు  శుక్ర‌వారం భారీ లాభాల‌తో ముగిశాయి. ఇవాళ కూడా ఆయిల్ మార్కెట్ గ్రీన్‌లో ఉంది. దీని కార‌ణంగా ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి ఏకంగా 35పైస‌లు పైగా బ‌ల‌హీన ప‌డింది. మార్కెట్‌కు ఇవాళ ఇదే ప్ర‌తికూల అంశంగా క‌న్పిస్తోంది. నిఫ్టి ఇపుడు 33 పాయింట్లు పెరిగి 10940 ప్రాంతంలో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ఫ్ర‌ధాన షేర్ల‌లో రిల‌య‌న్స్ జోరు ఇవాళ కూడా కొన‌సాగుతోంది. మొన్న భారీగా న‌ష్ట‌పోయిన స‌న్ ఫార్మా ఇవాళ స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడ‌వుతోంది. ఇన్ఫోసిస్‌లో అప్‌ట్రెండ్ కొన‌సాగుతోంది. బ‌జాజ్ ఫైనాన్స్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ త‌ర‌వాతి స్థానాల్లో ఉన్నాయి.  ఇక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో విప్రో ముందుంది. బోన‌స్ షేర్ల‌తో మొన్న భారీగా పెరిగిన ఈ కౌంట‌ర్‌లో భారీగా లాభాల స్వీక‌ర‌ణ జ‌రుగుతోంది. త‌ర‌వాతి స్థానాల్లో ఇన్‌ఫ్రా టెల్‌, ఎల్ అండ్ టీ, కొట‌క్ బ్యాంక్‌, హీరో మోటో కార్ఫ్ ఉన్నాయి.