సైరాలో నిహారిక పాత్ర ఇదేనట..!!

సైరాలో నిహారిక పాత్ర ఇదేనట..!!

మెగాకుటుంబం నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ కొణిదెల నిహారిక.  టాలెంట్ విషయంలో పెద్దగా వంకలు పెట్టాల్సిన అవసరం లేదు.  అదృష్టమే ఇంకా తలుపుతట్టలేదు.  ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించింది.  ఈ మూడు కూడా ఆశించినంతగా విజయం సాధించలేదు.  ఇప్పుడు సైరా ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది నిహారిక.  

సైరాలో కథాకళి నాట్య కళాకారిణిగా కనిపించబోతున్నదట.  పదినిమిషాల సమయం ఉండే ఈ పాత్ర కీలకమైనది అంటున్నారు దర్శకనిర్మాతలు.  ప్రస్తుతం నిహారిక కథాకళి నృత్యంలో శిక్షణ పొందుతున్నది.  కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా తెరకెక్కుతుంది.  తన పాత్ర చిన్నదే అయినప్పటికీ తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటే.. తరువాత బడా అవకాశాలు వస్తాయని నిహారిక అనుకుంటున్నది.  మెగాస్టార్ తో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న, సుదీప్ తదితరులు నటిస్తున్నారు.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.