సర్జరీలో కత్తెరను బయటకు తీసిన వైద్యులు

సర్జరీలో కత్తెరను బయటకు తీసిన వైద్యులు

కడుపులో కత్తెర ఘటనపై నిమ్స్ డాక్టర్లు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  జరిగిన తప్పుని గ్రహించిన వైద్యులు పేషెంట్ మహేశ్వరి చౌదరికి మరోసారి ఆపరేషన్ చేసారు. సర్జరీ ద్వారా కత్తెరను బయటికి తీసారు. ఇతర ఆర్గాన్స్ ఏమైనా దెబ్బ తిన్నాయా అని పరిశీలిస్తున్నారు. మరోవైపు నిమ్స్ వైద్యుల తీరుపై సీరియస్ అయిన  మహేశ్వరి భర్త హర్షవర్ధన్ పంజాగుట్ట పోలీసులకు  ఫిర్యాదు చేసారు.  బాధితుల ఫిర్యాదు మేరకు నిమ్స్ డాక్టర్ వేణుగోపాల్, అతనికి సహకరించిన వైద్యులపై పోలీసులు ఐపీసీ 336,337 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.