నీరవ్‌ మోడీః డమ్మీ డైరెక్టర్లు కైరోకు మార్పు

నీరవ్‌ మోడీః డమ్మీ డైరెక్టర్లు కైరోకు మార్పు

సీబీఐ కేసు నమోదు చేసిన వెంటనే వివాదాస్పద వజ్రాలు, నగల వ్యాపారి నీరవ్‌ మోడీ తన డమ్మీ కంపెనీ డైరెక్టర్లను హాంగ్‌ కాంగ్‌ నుంచి ఈజిప్టు రాజధాని కైరోకు తరలించారు. హాంగ్‌కాంగ్‌లో నీరవ్‌ మోడీకి ఆరు డమ్మీ కంపెనీలు ఉన్నాయి. ఈ డైరెక్టర్లందరినీ కైరోకు తరలించినట్లు దివ్యేష్‌ గాంధీ మీడియాకు తెలిపారు. నీరవ్‌కు చెందిన ఓ డమ్మీ కంపెనీలో ఇతను డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హాంగ్‌కాంగ్‌లోని ఆరు డమ్మీ కంపెనీల ఖాతాలను తానే చూసేవాడినని గాంధీ చెప్పారు.  సీబీఐ కేసు నమోదు అయిన వెంటనే  నీరవ్‌ మోడీ సవతి తమ్ముడు నేహల్‌ మోడీ... డమ్మీ కంపెనీ డైరెక్టర్ల ఫోన్లను ధ్వంసం చేశాడని, వారికి కైరోకు తరలించారని పేర్కొన్నారు. సీబీఐ దాఖలులో చేసిన చార్జిషీటులో దివ్యేష్‌ గాంధీని సాక్షిగా పేర్కొన్నారు. వివాదాస్పద లావాలన్నీ ఓ ప్రత్యేక ఈ మెయిల్‌ సర్వీస్‌ ద్వారా డమ్మీ కంపెనీ డైరెక్టర్లకు నీరవ్‌ మోడీ పంపేవాడని, నిర్ణీత సమయం తరవాత ఆ ఈమెయిల్స్‌ తమకు తాము దృశ్యమైపోయేవని... దీంతో సాక్ష్యులు లేకుండా నీరవ్‌ జాగ్రత్త పడ్డారని దివ్యేష్‌ చెప్పారు.