నేడు హైదరాబాద్‌కు గడ్కరీ

నేడు హైదరాబాద్‌కు గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు... సిటీ రూ.1562 కోట్ల అంచనా వ్యయంతో రోడ్ల అభివృద్ధి, వంతెన పనులకు నితిన్‌ గడ్కరీ శంకుస్థాపనలు చేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రూ186.71 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే అంబర్‌పేట - రామాంతపూర్ ఫ్లైఓవర్‌ను శంకుస్థాపన చేయనున్న గడ్కరీ... రూ 626.76కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఉప్పల్ - నారాపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను ప్రారంభిస్తారు. ఉప్పల్‌ కూడలి నుంచి స్టేడియం వరకు రూ. 311 కోట్లతో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఆరాంఘర్‌ - శంషాబాద్‌ వరకు రూ. 283.15 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు ఆయన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.