నిజామాబాద్ లో రైతుల ధర్నా

నిజామాబాద్ లో రైతుల ధర్నా

ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో రైతులు ధర్నా చేయనున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పసుపు, ఎర్ర జొన్న రైతులు 'ఛలో ఆర్మూర్'కు పిలుపునిచ్చారు. పసుపు క్వింటాల్ కు 15,000 వేలు, ఎర్ర జొన్న క్వింటాలకు 3,500 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేయనున్నారు. మామిడిపల్లి చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీతో పాటూ ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాకు 100 గ్రామాల నుంచి రైతులు తరలిరానున్నారు. రైతుల ఆందోళన దృష్ట్యా.. పోలీసుల అప్రమత్తం అయ్యారు. భారీగా భద్రత ఏర్పాట్లు చేసి రైతులు రోడ్డు ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.