చాలా ఊహించి థియేటర్ కు వెళ్తే.. అంతా కట్టే..!!

చాలా ఊహించి థియేటర్ కు వెళ్తే.. అంతా కట్టే..!!

అర్జున్ రెడ్డి డిఫరెంట్ ఆటిట్యూడ్ తో విజయ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు.  షర్ట్ లేకుండా తిరగడం, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించడం వంటివి చేయడంతో రాత్రికి రాత్రే క్రేజీ స్టార్ అయ్యాడు.  దీంతో విజయ్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాలో కూడా ఇదే విధమైన సీన్స్ ఉంటె బాగుంటుందని యూత్ ఎక్స్పెక్ట్ చేశారు. 

వీరి ఎక్స్పెక్ట్ కు తగ్గట్టుగానే లీకైన గీతా గోవిందం సీన్ లో లిప్ లాక్ దృశ్యం ఉన్నది.  విజయ్ సీట్లో కూర్చొని ఉంటె, రష్మిక విజయ్ ని లిప్ టు లిప్ కిస్ పెడుతుంది.  ఈ లీక్డ్ సీన్ తో సినిమాకు భారీ హైప్ వచ్చింది.  ఈ సీన్స్ పై ఆశలు పెట్టుకొని వెళ్లిన యూత్ కు సినిమాలో ఇలాంటి సీన్స్ కనిపించలేదు.  టైటిల్స్ రోలయ్యే సమయంలో బ్యాగ్ గ్రౌండ్ లో లిప్తమాత్రంగా కనిపించి కనిపించనట్టుగా చూపించారు.  సినిమా కథనాలు డీసెంట్ గా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతున్నారు.  అర్జున్ రెడ్డి ట్యాగ్ నుంచి విజయ్ బయటపడ్డట్టే కనిపిస్తుంది.  ఈ విషయంలో దర్శకుడు పరశురామ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.