ఉత్త‌మ్ ఇంట్లో సోదాల‌పై సీఈఓ వివ‌ర‌ణ‌

ఉత్త‌మ్ ఇంట్లో సోదాల‌పై సీఈఓ వివ‌ర‌ణ‌

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలతో సీఈఓ రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఈఓతో పాటు డీజీపీ  మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, రాష్ట్ర పోలీస్ ఎన్నికల నోడల్ అధికారి జితేంద్ర హాజరయ్యారు. అనంతరం జితేంద్ర మాట్లాడుతూ... మేము న్యూట్రల్ గా పనిచేస్తున్నాం. మాకు అన్ని పార్టీలు సమానమే. మాపై మహాకూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. మహాకూటమి నేతలు చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండ్లలో సోదాలు చేసినట్లు సీఈఓ రజత్ కుమార్ కు పిర్యాదు చేసారు. కానీ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి ఇండ్లలో ఎలాంటి సోదాలు చెయ్యలేదని స్పష్టం చేశారు.