ప్రయాణికులకు తెలంగాణ సర్కారు శుభవార్త 

ప్రయాణికులకు తెలంగాణ సర్కారు శుభవార్త 

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయరహదారిపై టోల్‌గేట్ల వసూళ్లను రెండు రోజులపాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇవాళ (జనవరి 13), బుధవారం (జనవరి 16) టోల్ వసూళ్లు ఉండవని స్పష్టం చేసింది. పండుగ వేళ విపరీతమైన రద్దీతోపాటు టోల్‌గేట్ల వద్ద ఆలస్యానికి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.