తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ

తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతుంది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతోంది.