కుప్పకూలిన పారిశ్రామిక ఉత్పత్తి

కుప్పకూలిన పారిశ్రామిక ఉత్పత్తి

దేశ పారిశ్రామిక పరిస్థితి చాలా దారుణంగా మారుతోంది. ముఖ్యంగా గత నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి అంత క్రితం నెలతో పోలిస్తే ఘోరంగా పడిపోయింది. అక్టోబర్‌లో 8.5 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి సూచి 0.5 శాతానికి పడిపోయింది. ఇది 19 నెలల కనిష్ఠ స్థాయి. అనేక కీలక పరిశ్రమల్లో ఉత్పత్తి దారుణంగా తగ్గినట్లు తాజా ప్రభుత్వ డేటా వెల్లడించింది. నవంబర్‌లో మైనింగ్‌ వృద్ధి రేటు 2.7 శాతం కాగా, ఎలక్ర్టిసిటీ  రంగం వృద్ధి రేటు 5.1 శాతానికి పడిపోయింది. మ్యాన్యూఫ్యాక్చరింగ్‌ రంగ వృద్ధిరేటు తిరోగమనంలో మైనస్‌ 0.4 శాతంగా నమోదైంది. ఈ మూడు రంగాల వృద్ధి ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్యకాలంలో కూడా దారుణంగా ఉంది. వినియోగవస్తువుల ఉత్పత్తి వృద్ధి రేటు అక్టోబర్‌లో 17.6 శాతం ఉండగా, నవంబర్‌లో మైనస్‌ 0.9కి చేరింది. అలాగే నాన్‌ కన్జూమర్‌ రంగాల వృద్ధి రేటు 7.9 శాతం నుంచి మైనస్‌ 0.6కి పడిపోయింది.