ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్
జై లవకుశ హిట్ తరువాత కొంత గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు.  రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  అజ్ఞాతవాసి సినిమా భారీ పరాజయం తరువాత, త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఈ సినిమా చేస్తున్నారు.  
ఈ సినిమాకు సంబంధించిన తాజా న్యూస్ ఒకటి బయటకువ వచ్చింది.  ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అసామాన్యుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు.  నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే ముందు రోజున రిలీజ్ చేశారు. ఆ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఎన్టీఆర్ బర్త్ డే ముందు రోజైన మే 19 సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీ చేయబోతున్నారు.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.