టార్గెట్ కు కొద్దిదూరంలో.. కథానాయకుడు

టార్గెట్ కు కొద్దిదూరంలో.. కథానాయకుడు

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటిభాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది.  యూఎస్ లో ప్రీమియర్ టికెట్స్ భారీ ఎత్తున సేల్ అయ్యాయి.  సినిమా రిలీజ్ రోజున ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు.  పెద్ద ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటంతో లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద విషయం ఏమీకాదు అనుకున్నారు.  

మొదటి రోజు కలెక్షన్ వివరాలను కొద్దసేపటి క్రితమే ప్రకటించారు.  వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.21 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది.  మరో రూ.9 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేవారు.  బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ డే ఇంతమొత్తంలో వసూలు చేసిన సినిమా ఇదే కావడం విశేషం.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.7.7 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.