ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ కలెక్షన్ ఎంతంటే..?

ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ కలెక్షన్ ఎంతంటే..?

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకోవడంతో పాటు రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి.  యూఎస్ లో బాలకృష్ణ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.  ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో సినిమా ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠత మధ్య టికెట్స్ కొనుగోలు జరిగింది.  ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా ఐదు లక్షల డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  బాలకృష్ణ సినిమాల్లో ఇది టాప్ అని చెప్పొచ్చు.  2018-19 లో ప్రీమియర్ షోల ద్వారా ఎక్కువ మొత్తంలో వసూళ్లు రాబట్టి 6 వ సినిమాగా రికార్డ్ సృష్టించింది.  

మొదటి రోజు యూఎస్ ఎంత కలెక్ట్ చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూళ్లు సాదించించిందనే విషయం మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.