కసరత్తులు స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ !

కసరత్తులు స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ !

'ఆర్ఆర్ఆర్' సినిమా మొదటి షెడ్యూల్లో పాల్గొన్న ఎన్టీఆర్ రెండవ షెడ్యూల్లో పాల్గొనలేదు.  2వ షెడ్యూల్ మొత్తం రామ్ చరణ్ మీదనే జరిగింది.  కొన్ని పోరాట సన్నివేశాల్ని షూట్ చేశారు.  త్వరలోనే తారక్ తాలూకు షూటింగ్ మొదలుకానుంది.  అందుకే ఆయన కసరత్తులు మొదలుపెట్టాడు.  పాత్ర కోసం బాడీ బిల్డ్అప్ చేస్తున్నాడు.  వ్యక్తిగత ట్రైనర్ లాయిడ్ స్టీఫెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్కవుట్స్ చేస్తున్నాడు.  గతంలో స్టీఫెన్స్ 'జైలవకుశ' సినిమాకు తారక్ తో కలిసి పనిచేశాడు.  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు.