09 నవంబర్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

09 నవంబర్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

మేషం

శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. కష్టాల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అష్టమ చంద్ర దోషం ఉంది. చంద్ర ధ్యానం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం
మంచి పనులు చేపడతారు. ఒక తీపి కబురు వింటారు. మీమీ రంగాల్లో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శని ధ్యానం మంచిది.

మిథునం
శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మాటకు విలువిస్తే మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమయానికి భోజనం తీసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచి జరుగుతుంది.

కర్కాటకం
తలపెట్టిన కార్యాన్ని మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. కలహ సూచన, అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి. లక్ష్మీ ఆరాధన మంచిది.

సింహం
చేపట్టిన పనులలో అస్థిర బుద్ధిని రాకుండా చూసుకోవాలి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కన్య
వృత్తి ఉద్యోగులకు శుభకాలం. మనోధైర్యంతో ముందడుగు వేస్తే సత్ఫలితాలను సాధిస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా గుడుపుతారు. అయితే వారి వల్ల అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధార స్త్రోత్రం చదివితే బాగుంటుంది.

తుల
కీలక వ్యవహారములలో ధైర్యముగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అనవసర ఖర్చులు తగ్గించాలి. శివారాధన శుభప్రదం.

వృశ్చికం
మిశ్రమ కాలం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. అనవసర కలహాలు సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకములు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. అష్టలక్ష్మీ స్తుతి మంచిది.

ధనుస్సు
చేపట్టిన పనులలో తోటివారి సహాకారం అందుతుంది. ఆర్ధిక విషయాల్లో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శని శ్లోకం పఠిస్తే బాగుంటుంది.

మకరం
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావోచ్చు. కుటుంబసభ్యులలో ఒకరి అనారోగ్యం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కుంభం
మీమీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మీనం
ఒక వార్త బాధ కలిగిస్తుంది. ప్రయాణాలు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం బాధ కలిగిస్తుంది. దుర్గాదేవిని వేంకటేశ్వరుణ్ని పూజిస్తే అశుభఫలితాలు తగ్గి శుభఫలితాలు కలుగుతాయి.
                                                                                                                                                                                        డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్, పీహెచ్ డీ