12 జనవరి 2019 శనివారం మీ రాశిఫలాలు

12 జనవరి 2019 శనివారం మీ రాశిఫలాలు

మేషం
మీ మిత్రులతో, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. ఈ రోజు కొంత బద్ధకం కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.

వృషభం
మీ స్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. మీసంతానం కారణంగా ఆనందం పొందుతారు.

మిథునం
మీ మిత్రులు లేదా బంధువుల సాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు. పైఅధికారులను కలవడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందలకు కూడా అనుకూలించే దినం. ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. 

కర్కాటకం
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం చేస్తారు. 

సింహం
ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు ఉంటాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనస్సు చెదురుతుంది. శివుడ్ని పూజించండి.

కన్య
మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనువైన దినం. ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. 

తుల
మీ మాట నెగ్గుతుంది. ఆర్థిక లాభాలుంటాయి. గృహ, వాహన సంబంధ కొనుగోలు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. 

వృశ్చికం
మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనస్సులో ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు
మానసికంగా కొంత ఆందోళనకు లోనవుతారు. చదువు పట్ల కొంత ఆ శ్రద్ధ ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. మీ ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది.

మకరం
అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. మీరిచ్చే సలహాలు ఎదుటివారికి లాభిస్తాయి. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. 

కుంభం
పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. 

మీనం
అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.