ప్రధాని మోడీ సాక్షిగా... మంత్రి "గోకుడు"

ప్రధాని మోడీ సాక్షిగా... మంత్రి "గోకుడు"

త్రిపురలో ఓ మంత్రి మరో మహిళ మంత్రి పట్ల అసభ్యంగా ప్రవరించాడు. అదీ సాక్షాత్తూ ప్రధాని మోడీ పాల్గొన్న సభలోనే.  ఎదురుగా ప్రధాని మోడీ శంకుస్థాపనలో బిజీగా ఉంటే.. ఈయనేమో పక్కన నిల్చున మహిళా మంత్రిని వేధించాడు. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయింది. ఓ బాధ్యతయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి  తోటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించటం పట్ల వీడియో చూసిన వారంతా నివ్వెరపోతున్నారు.  ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. 

అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మనోజ్‌ కాంతి దేవ్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ నేతలు ఘటనను తోసిపుచ్చారు.  వీడియో అంతా బూటకమని కొట్టిపారేశారు.