ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై మరోకేసు  

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై మరోకేసు  

భూ వివాదం విషయంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేపై మైలార్‌ దేవ్‌ పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆవుల శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌పై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 447,427,506 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.  ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. గతంలో ఆవుల శ్రీనివాస్ తండ్రికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ భూమిని అమ్మాడు. ఇప్పుడు ఈ భూమి తాను అమ్మలేదని.. అది తన భూమేనంటూ... ఆవుల శీనివాస్ పై స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి కబ్జాకు గురి చేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ప్రకాశ్‌ గౌడ్‌ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు.