డీజే సౌండ్‌ దెబ్బకు విద్యార్థి మృతి 

డీజే సౌండ్‌ దెబ్బకు విద్యార్థి మృతి 

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో డీజే సౌండ్‌తో ఓ విద్యార్థి మృతి చెందాడు. రంగయ్యపల్లె గ్రామానికి చెందిన ఆషాడపు రాజేష్‌(22) అనే విద్యార్థి డీజే సౌండ్ కారణంగా కుప్పకూలిపోయిన ఘటన కలకలం రేపింది. 

మండల మహేశ్‌ అనే యువకుడి వివాహం భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లె గ్రామంలో జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా రాత్రి పెళ్లి కుమారుడి ఊరేగింపు జరుగుతుండగా డ్యాన్స్‌ చేసేందుకు రాజేశ్‌ వెళ్లగా.. అక్కడ ఒక్కసారిగా డీజే మోతతో కూప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే  మృతి చెందాడు. హన్మకొండలో డిగ్రీ పూర్తి చేసిన రాజేశ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కుమారుడి మృతితో రాజేశ్‌ తల్లిదండ్రులు బోరున విలపించారు. అతడు డీజే సౌండ్‌తోనే మృతి చెందినట్లు వంగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించిన వంగర ఏఎస్ఐ మురళీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.