చ‌మురు స‌ర‌ఫరా త‌గ్గిస్తాం... ఒపెక్‌

చ‌మురు స‌ర‌ఫరా త‌గ్గిస్తాం... ఒపెక్‌

చమురు ఉత్పత్తులను తాత్కాలికంగా తగ్గించేందుకు ఒపెక్ అంగీకారం తెలిపింది. అయితే... నాన్ ఒపెక్ దేశమైన రష్యా అభిప్రాయాన్ని కూడా తెలుసుకోనుంది. ఉత్పత్తిలో ఏమేరకు తగ్గించాలనే దానిపై స్పష్టత రాలేదు.  ఈ విషయంపై గతంలో రష్యా ఎనర్జీ మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ప్రెసిడెంట్ వ్లాధిమిర్ ఫుథిన్ చర్చించారు. అక్టోబర్ మూడు నుంచి క్రూడ్ అయిల్ ధరలు దిగివస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ను చమురు ఉత్పత్తులను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. 

ఒకప్పుడు చమురు సరఫరా బాగా పెరిగి ధరలు బాగా తగ్గడంతో ఒపెక్ ఉత్పత్తిపై కోత విధించింది. చమురు ధరలకు స్థిరత్వం తెచ్చేందుకు గతంలో సౌదీ అరేబియాతోపాటు నాన్ ఒపెక్ దేశమైన రష్యా చమురు ఉత్పత్తిలో కోత విధించుకున్నాయి. దీంతో ఇటీవల చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టాలను తాకాయి. చమురుకు అతిపెద్ద కొనుగోలు దేశాలైన అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలు క్రూడాయిల్ ధరలు తగ్గించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయిల్ డెఫిసిట్ ఎదురు కాకుండా చూడాలని కోరాయి. దీనికి స్పందనగా  రష్యా, సౌదీ అరేబియాలు మే నెలలో ఉత్పత్తిని పెంచాయి. అయితే ఒపెక్‌లోని ఇతర సభ్యదేశాలైన ఇరాన్‌, వెనిజులా, అల్జీరియా, ఇరాక్‌ దీనిని వ్యతిరేకించాయి. తాజాగా చమురు ఉత్పత్తులను తాత్కాలికంగా తగ్గించేందుకు ఒపెక్ అంగీకరించింది. అయితే.. శీతాకాలంలో చమురు ఉత్పత్తిని తగ్గించడం కష్టమని రష్యా స్పష్టం చేసింది. గడ్డ కట్టించే చలి వాతావరణం కారణంగా రష్యాలో చమురు క్షేత్రాలలో చమురు ఉత్పత్తిని  మిగతా ఉత్పత్తిదారుల కంటే తగ్గించుకోవడం సాధ్యం కాదని రష్యా ఇంధన మంత్రి అలెగ్జాండర్ నొవాక్ స్పష్టం చేశారు.