చమురు ఉత్పత్తిని ఒపెక్ తగ్గిస్తుందా..?

చమురు ఉత్పత్తిని ఒపెక్ తగ్గిస్తుందా..?

ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్  కంట్రీస్ (ఓపీఈసీ) ఒపెక్ చమురు ఉత్పత్తులను తగ్గించే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తికి మద్దతుగా నిర్వహించనున్న  సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రపంచంలో అత్యధిక చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు వియన్నాలో సమావేశం నిర్వహించనున్నాయి. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒపెక్, దాని మిత్రపక్షాలతో  చమురు ఉత్పత్తిని అధికం చేయమని పిలుపునిచ్చారు. అనంతరం ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఒపెక్ దేశాలు మాత్రం మాత్రం  ఉత్పత్తిని తగ్గించాలని అవకాశం ఉంది. ఈ మేరకు ఒమాన్ చమురు శాఖ మంత్రి మహమ్మద్ బీన్ హమద్ అల్ రష్మీ చమురు ఉత్పత్తి తగ్గించే సూచనలు ఉన్నాయని తెలిపారు.  ఉత్పత్తిలో ఏ మేరకు తగ్గించాలన్నదానిపై స్పష్టత లేదు. ఒపెక్ దేశాల్లో సౌదీ అరేబియా అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశం రోజుకు 1.3 మిలియన్ బ్యారళ్లు ఉత్పత్తి చేయనుంది. ఇది ప్రపంచ మార్కెట్లో 1.3 శాతం