ఒప్పో ఆర్17 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ఒప్పో ఆర్17 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ 'ఒప్పో' తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఆర్17 ప్రొ'ను తాజాగా భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రేడియెంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వేరియెంట్లలో లభించనుంది. రూ.45,990 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అమెజాన్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి లభించనుంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లు  కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీంతో కేవలం 0.41 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.. వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో సూపర్ వూక్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్‌ ఉంది. దీంతో 100% ఫోన్ చార్జింగ్ కేవలం 40 నిమిషాలలో అవుతుంది.

ఫీచర్లు:

#6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
# 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
# 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
# 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
# గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
# ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
# 3700 ఎంఏహెచ్ బ్యాటరీ
# సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్