మోడీజీ.. 50రోజుల డెడ్ లైన్ గుర్తుందా?

మోడీజీ.. 50రోజుల డెడ్ లైన్ గుర్తుందా?

పెద్ద నోట్ల రద్దు జరిగి రెండేళ్లయిన క్రమంలో.. ఆనాడు మోడీ ఇచ్చిన మాటను ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే 50 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులూ ఉండవని మోడీ ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు..50 రోజుల తరువాత తన దోషం ఉన్నట్టు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ గంభీర వచనాలు కూడా పలికారు. ఆ మాటల్నే తాజాగా సీపీఎం నేత యేచూరి సీతారాం ట్విట్టర్ వేదికగా ప్రధానికి గుర్తు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ నేతలు మనీశ్ తివారీ, శశిథరూర్, చిదంబరం లాంటి సీనియర్ నేతలు సైతం ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు సంధించారు. 

మోడీ ఇచ్చిన మాటను దిగ్విజయంగా మరచిపోయారని, అయితే దాన్ని గుర్తు చేయడమే తమ బాధ్యతని యేచూరి అన్నారు.