పద్మ అవార్డులకు ఆహ్వానం...

పద్మ అవార్డులకు ఆహ్వానం...

వివిధ రంగాలలో విశేషమైన సేవలందించే వారికి కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు అందజేయనుంది. కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి.. భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల నుంచి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానించింది. రిపబ్లిక్ డే సంద్భరంగా ఇవ్వబోయే పద్మ అవార్డులకు ఇప్పటి వరకు 1200కు పైగా నామినేషన్లు వచ్చాయి. 

తాము ఎంచుకొన్న రంగంలో విశేషమైన కృషిచేసిన ప్రతిభావంతులను వారి సేవలు గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా www.padmaawards.gov.in అనే వెబ్ సైట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ వెబ్ సైట్ లో ఇప్పటి వరకు 1,654 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మే 1 నుంచి ప్రారంభమైన పరిశీలనలో 1,207 నామినేషన్లు, సిఫార్సులు సంపూర్ణంగా ఉన్నట్టు హోమ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ పౌరులెవరైనా పద్మ అవార్డులకు నామినేట్ లేక సిఫార్సు చేయవచ్చు. పద్మ అవార్డులకు ఆన్ లైన్ నామినేషన్లు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ.