బీజేపీలో చేరిన పద్మినీ రెడ్డి

బీజేపీలో చేరిన పద్మినీ రెడ్డి

తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక్కోక్కరుగా పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు. పద్మినీ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న నమ్మకంతోనే బీజేపీలో చేరానని తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రగతి బాటన నడుస్తోంది అని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం పట్ల పద్మినీ రెడ్డి నమ్మకాన్ని స్వాగతిస్తున్నాం అని మురళీధర్ రావు అన్నారు. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ వర్గాలు షాక్ కి గురయ్యాయి.