పంచాయతీ బరిలో ఎంతమందంటే..?

పంచాయతీ బరిలో ఎంతమందంటే..?

తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 4,479  గ్రామపంచాయితీలకుగానూ సర్పంచ్‌ పదవులకు 27,940 మంది పోటీ పడుతున్నారు. 39,822 వార్డు మెంబర్లగానూ 97,690 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు అవకాశం ఉంది. తొలిదశ  పోలింగ్‌ ఈనెల 21న జరగనుంది. ఈ నెల 21న పోలింగ్ జరుగుతుంది. ఇక.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 542 పంచాయతీలకుగానూ17 గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్ ను  ఎన్నుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 28 పంచాయతీలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 20 పంచాయతీలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 45, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 15 పంచాయతీలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 29, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 81 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.