ఏకగ్రీవం విషయంలో విభేదాలు.. ఆత్మహత్యాయత్నం!

ఏకగ్రీవం విషయంలో విభేదాలు.. ఆత్మహత్యాయత్నం!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే తొలి ఎన్నికలకు నామినేషన్ల దాఖలు కూడా ప్రారంభమైంది. మరోవైపు పంచాయతీల ఏకగ్రీవానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. అయితే జగిత్యాల జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవం విషయంలో విభేదాలు చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని మల్లాపూర్ మండలం నూతన గ్రామపంచాయతీ ఓబులాపూర్ తండాలో సర్పంచ్ ఏకగ్రీవ విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన గుగ్లవత్ దేవాస్ నాయక్‌ అనే వ్యక్తి విషగుళికలు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం మెటుపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.