పారిస్ లో భారీ పేలుడు - 4గురు మృతి

పారిస్ లో భారీ పేలుడు - 4గురు మృతి

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో భారీ పేలుడు సంబవించింది. 9వ అరోన్ డిస్ మెంట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా 30 మంది గాయపడ్డారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రక్షణ చర్యలో భాగంగా ఇద్దరు ఫైర్ ఫైటర్స్ చనిపొయారని తెలిపారు. భారీ పేలుడు వల్ల బేకరీ చుట్టుపక్కల మొత్తం భయానకవాతావరణం నెలకొంది. ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలువలేదు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం జరిగిన భవనంలోని ఓ బేకరీ ఉంది. అందులో గ్యాస్‌ లీకై పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు ఘటనా స్థలం వైపు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదు.