హరికృష్ణ మరణం దురదృష్టకరం - పవన్

హరికృష్ణ మరణం దురదృష్టకరం - పవన్

 

నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీమంత్రి నందమూరి హరికృష్ణ అకాల మరణం యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది.  ఆయన మృతితో సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.  హరికృష్ణ మరణ వార్త విన్న వెంటనే పవన్ స్పందిస్తూ హరికృష్ణకు ప్రమాదం జరిగిందని తెలియగానే గాయాలతో బయటపడతారని ఆశించాను, కానీ కొద్దిసేపటికే ఆయన మరణ వార్తను వినాల్సి వచ్చింది, ఆయన మృతి  దురదృష్టకరం అన్నారు పవన్ కళ్యాణ్.  

అలాగే ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు జనసేన కార్యాలయంలో జరగాల్సిన ముఖ్యమైన మీటింగులు, గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను రద్దు చేస్తున్నట్టు కూడ ప్రకటించారు.  అంతేగాక ఈ కష్ట సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఆయన కుటుంబానికి ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.