బ్రిటిష్ పాలనలాగే

బ్రిటిష్ పాలనలాగే

ప్రభుత్వ పాలనపై చాలా రోజులుగా విమర్శలు చేస్తున్న పవన్ మరోసారి స్థానిక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ మాట్లాడుతూ లార్డ్ మెక్యులి ప్రతిపాదించిన సిద్ధం గురించి ప్రస్తావిస్తూ అభివృద్ధి పేరుతో మన సంపదను, నాగరికతను నాశనం చేస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇదే పద్దతిని అలంభించి మన దేశాన్ని నాశనం చేసినట్టు, ఇప్పుడు మన సొంత పాలకులు దోచుకుంటాన్నారని ధ్వజమెత్తారు. 

లార్డ్ మెక్యులి 1835, ఫిబ్రవరి 2న బ్రటిష్ పార్లిమెంట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఆఫ్రికా దేశమంతా తిరిగొచ్చాను. ఈ దేశంలో ఒక్కరు కూడా బిచ్చగాళ్ళు లేరు. ఎంతో సుసంపన్నంగా, సుభిక్షంగా, న్యాయ బద్ధంగా, ప్రజలు కూడా పట్టుదలగా పనిచేస్తున్నారు. అసలు మనం వీళ్ళని మన ఆదీనంలోకి తెచ్చుకోగలమా అని సందేహం వచ్చింది. కానీ ఇందుకోసం వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, సంప్రదాయాన్ని మార్చేస్తే చాలనుకుని..వాళ్ళ పూర్వపు పద్దతలను మొత్తంగా మన వాటితో మార్చేశాం. కాబట్టి వాళ్ళ మాతృకను మర్చిపోయి..ఆంగ్ల భాషే..తమ మాతృ భాష కంటే గొప్పదిగా భావిస్తారు. దీని వల్ల తమ ఉనికిని కోల్పోయి..మన చెప్పు చేతుల్లోకి వస్తారు అనే సిద్దాంతాన్ని మెక్యులి ప్రతిపాదించారు. ఇప్పుడు పవన్ కూడా ఇదే ధోరణి మన పాలకుల్లో కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.