జగన్‌ గుర్తించకపోతే మాకు ఉనికి లేనట్టా..?

జగన్‌ గుర్తించకపోతే మాకు ఉనికి లేనట్టా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్... అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్ గుర్తించనంత మాత్రాన జనసేన పార్టీకి ఉనికి లేనట్టు కాదు కదా? అని ప్రశ్నించారు. మొన్న ఒక్క పిలుపు ఇస్తే ఎన్నో లక్షల మంది కవాతుకు వచ్చారు, మరి ఆయనకు అది కనపడకపోతే ఎవరు ఏమి చేయగలరు అన్నారు పవన్. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనేసిందని జగన్‌ అసెంబ్లీకి వెళ్లటం మానేస్తారా! ఇదేనా? మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చిన గౌరవం అంటూ ఫైర్ అయిన పవన్... ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయడం కూడా చాలా నీచమైన పని అని మండిపడ్డారు. తప్పు చేశారు అని జగన్ ప్రజా సమస్యలను వదిలేసి రోడ్ల మీద తిరగటం చాలా తప్పు అని హితవు పలికిన పవన్ కల్యాణ్... ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే సత్తా జనసేనకు ఉంటుంది, అది వైస్సార్సీపీ వారికి లేదు అని సెటైర్లు వేశారు.