తిరుమల తీర్థయాత్రలో పవన్.. 

తిరుమల తీర్థయాత్రలో పవన్.. 

తిరుమలలోని పలు తీర్థాలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం సందర్శించుకున్నారు. ఉదయం జాపాలి తీర్థానికి చేరుకుని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పాపవినాశనం తీర్థం చేరుకుని అక్కడ పవిత్ర జలాలతో సంప్రోక్షణం చేసుకున్నారు. అక్కడే గంగాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరిగి హంపీ మఠానికి చేరుకున్నారు. 

మూడు రోజుల పర్యటనలో భాగంగా.. తిరుపతి వచ్చిన పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలోనే నిద్రచేసి ముగించుకోనున్నారు. ఇక రేపు ఉదయం తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్లి వాయులింగేశ్వర, గుడిమల్లం పరశురామ ఆలయాలను, వికృతమాల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీకాళహస్తిలో దర్శనం ముగించుకున్న తర్వాత చిత్తూరులో పర్యటించి.. హైరోడ్డు నిర్వాసితులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత బస్సు యాత్ర చేసే అవకాశంపై పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.