11, 12 తేదీల్లో పవన్ కల్యాణ్ చర్చలు...

11, 12 తేదీల్లో పవన్ కల్యాణ్ చర్చలు...

తెలంగాణ అసెంబ్లీ రద్దుతో అన్ని పక్షాలు ముందస్తు ఎన్నికలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పనిచేసేవిషయంపై ఈ నెల 11, 12 తేదీల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో చర్చలు జరపనున్నారు. నిన్నసమావేశమై తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ... సీపీఎంతో చర్చలకు సిద్ధమవుతోంది. ఇటీవలే సీపీఎం బృందంతో చర్చలు జరిపిన విషయాన్ని రాజకీయ వ్యవహారాల కమిటీకి వివరించిన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్... మళ్లీ సీపీఎం నేతలను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీయేర కూటమి కోసం జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.